కోహ్లీ కుమార్తె తొలి చిత్రాన్ని విడుదల చేసిన సోదరుడు వికాస్!

12-01-2021 Tue 10:41
  • నిన్న విరుష్క దంపతులకు ఆడబిడ్డ
  • వెల్ కమ్ మెసేజ్ పెడుతూ వికాస్ పోస్ట్
  • తమ ఇంటికి దేవత వచ్చిందని వ్యాఖ్య
Kohli Daughter First Pic

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క దంపతులకు నిన్న పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించాడు. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమమేనని పేర్కొన్నాడే తప్ప, బిడ్డ చిత్రాన్ని మాత్రం పంచుకోలేదు.

 అయితే, వీరిద్దరికీ పుట్టిన బిడ్డ ఎలా ఉందన్న విషయమై నెట్టింట పెద్ద చర్చ జరుగుతున్న వేళ, కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడే పుట్టిన పాప కాళ్ల చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, 'వెల్ కమ్' మెసేజ్ పెట్టాడు. దీనికి 'మా ఇంటికి దేవత వచ్చింది. పట్టరాని సంతోషంగా ఉంది' అని ఆయన క్యాప్షన్ కూడా రాశాడు. ఇక ఈ చిత్రం అధికారికంగా కోహ్లీ కుమార్తేనా? కాదా? అన్న విషయం తెలియకపోయినా, పాప ఫోటోనే వికాస్ పోస్ట్ చేశాడని నెటిజన్లు దీన్ని వైరల్ చేస్తున్నారు.