Donald Trump: 2021 జనవరి 11, రాత్రి 19:49 గంటలు... ట్రంప్ శకం ముగిసిందని యూఎస్ పొరపాటు ప్రకటన!

  • మారిపోయిన ట్రంప్ ప్రొఫైల్ పేజీ
  • సాంకేతిక తప్పిదమని ప్రకటించిన ప్రభుత్వం
  • ఇంకా స్పందించని వైట్ హౌస్ వర్గాలు
US State Department Announces Trump Era is End then says Technicle Fault

అమెరికా ప్రభుత్వం చేసిన సాంకేతిక తప్పిదం నెట్టింట వైరల్ అయింది. ఒకవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అభిశంసించే ప్రక్రియ మొదలైన వేళ, ప్రభుత్వ నియంత్రణలో ఉండే, అధికారిక వెబ్ సైట్ లో ట్రంప్ శకం ముగిసిందని ప్రకటించింది. "2021 జనవరి 11, రాత్రి 19.49 గంటలకు ట్రంప్ తన బాధ్యతల నుంచి వైదొలగారు" అని ట్రంప్ ప్రొఫైల్ లో పేర్కొంది. ఆ వెంటనే ఇది వైరల్ కాగా, తదుపరి వివరణ ఇచ్చింది. ఇది సాంకేతిక తప్పిదమని పేర్కొంటూ ఆ పేజీని తొలగించింది.

ఈ విషయంలో వైట్ హౌస్ ఇంకా స్పందించలేదు. అమెరికాకు తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అంతకన్నా ముందుగానే ట్రంప్ ను పంపించాలని, అభిశంసనకు గురి చేయడం ద్వారా, మరోసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్ కు సన్నిహితులుగా ముద్రపడ్డ పలువురు సైతం అభిశంసన తీర్మానానికి మద్దతు పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కొందరు రిపబ్లికన్లు మాత్రం ఈ చర్యకు వ్యతిరేకంగా ఉన్నారు.

More Telugu News