Corona Virus: ఇలాంటి లక్షణాలుంటే టీకా వద్దే వద్దు: డబ్ల్యూహెచ్ఓ

WHO Guidelines for Vaccine
  • ఎలాంటి అలర్జీ ఉన్నా టీకా వద్దు
  • గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి
  • హెచ్ఐవీ రోగులకూ ఇదే సూచన
ఇండియాలో కరోనా మహమ్మారికి టీకా అందుబాటులో రానుంది. ఇదే సమయంలో కొన్ని రకాల రుగ్మతలు ఉన్నవారు, మరికొన్ని వర్గాల వారు టీకాకు దూరంగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, మార్గదర్శకాలు జారీ చేసింది. ఎటువంటి మందులు తీసుకున్నా అలర్జీ వచ్చే వారు ఈ టీకాకు దూరంగా ఉండటమే మంచిదేనని పేర్కొంది.

ఇదే సమయంలో గర్భిణీ స్త్రీలు కూడా హై రిస్క్ జాబితాలో ఉంటారని, ఒకవేళ వారు టీకా తీసుకోవాలంటే వ్యాక్సినేటర్ ను సంప్రదించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక, మామూలుగా ఉండే మహిళలు టీకా తీసుకుంటే, కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు గర్భధారణకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇదే సమయంలో హెచ్ఐవీ రోగులకు కూడా కరోనా ముప్పు అధికమని గుర్తు చేసింది.

హెచ్ఐవీ రోగులకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ సమాచారం చాలా తక్కువగాగా ఉందని, ఈ వైరస్ బారిన పడిన వారు టీకాను తీసుకునేందుకు వస్తే, తమకున్న వ్యాధి గురించిన సమాచారాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా, వెంటనే వైద్యాధికారులను సంప్రదించాలని సూచించింది.
Corona Virus
Vaccine
WHO

More Telugu News