ఏపీ నుంచి వస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీయే కొరడా!

12-01-2021 Tue 09:18
  • నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులు
  • హైదరాబాద్ శివార్లలో తనిఖీలు
  • ఐదు బస్సులపై కేసుల నమోదు

నిబంధనలకు విరుద్ధంగా, సరైన పర్మిట్లు లేకుండా, ప్రయాణికుల నుంచి అధిక చార్జీలను వసూలు చేస్తూ, ఏపీ, తెలంగాణల మధ్య తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీయే అధికారులు కొరడా ఝళిపించారు. ఈ ఉదయం హైదరాబాద్ శివార్లలో పలు చోట్లు వస్తున్న ప్రతి బస్సును తనిఖీ చేశారు. బెంగళూరు, తిరుపతి, కడప నుంచి వచ్చే బస్సులను శంషాబాద్ వద్ద, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం వైపు నుంచి వచ్చే బస్సులను ఔటర్ రింగ్ రోడ్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఇంతవరకూ ఐదు బస్సులపై కేసులు నమోదు కాగా, దాడులు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.