Vishnu Vardhan Reddy: మేం యాత్ర చేస్తుంటే మీకు రాజకీయం కనపడుతోందా... నాడు మీరు చేసిందేమిటి?: సీఎం జగన్ పై విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు

Vishnuvardhan Reddy questions CM Jagan over Yatras
  • ఏపీలో విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ వ్యాఖ్యలు
  • రథాలు దగ్ధం చేసి రథయాత్రలు చేస్తుంటారని విమర్శలు
  • తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విష్ణువర్ధన్ రెడ్డి
  • ధర్మరక్షణ కోసం తాము యాత్ర చేస్తున్నామని స్పష్టీకరణ
  • జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ వ్యాఖ్యలు
ఏపీలో విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల పట్ల సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. కొందరు రథాలు ధ్వంసం చేసి రథయాత్రలు చేసేందుకు సిద్ధమవుతుంటారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సీఎం జగన్ పై మండిపడ్డారు. ఆనాడు మీరు కూడా యాత్రలు చేశారు... ఇవాళ మేం యాత్ర చేస్తే తప్పయిందా? అని ప్రశ్నించారు.

"ఆ రోజు మీరు చేసిన యాత్రలు ఏ రాజకీయాల కోసం చేశారు ముఖ్యమంత్రిగారూ? నేడు మీ పాలనలో కొందరు దేవాలయాలపై దండయాత్ర చేస్తున్నారు. విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. దేవాలయాల కోసం, ధర్మ రక్షణ కోసం మేం యాత్రలు చేస్తుంటే మీకు రాజకీయం కనపడుతోందా? దీనిపై ప్రజలకు సమాధానం చెప్పండి" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.
Vishnu Vardhan Reddy
Jagan
Yatra
BJP
YSRCP

More Telugu News