Team India: ఆసీస్‌కు దీటుగా బదులిస్తున్న టీమిండియా

  • ఆచితూచి ఆడుతున్న భారత జట్టు
  • అర్ధ సెంచరీతో జోరుమీదున్న పంత్
  • విజయానికి 201 పరుగులు.. చేతిలో ఏడు వికెట్లు
India vs Australia 3rd test

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. ఆచితూచి ఆడుతూ క్రమంగా లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. ఐదో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను 312 పరుగుల వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్థి ఎదుట 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.  రోహిత్ శర్మ 52, గిల్ 31 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓవర్‌నైట్ స్కోరుకు నాలుగు పరుగులు మాత్రమే జోడించి మరో వికెట్ చేజార్చుకుంది. లయన్ బౌలింగ్‌లో వేడ్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ రహానే (4) ఔటయ్యాడు. ప్రస్తుతం చటేశ్వర్ పుజారా 41, రిషభ్ పంత్ 73 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి ఇంకా 201 పరుగులు అవసరం కాగా, చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.

More Telugu News