వికారాబాద్ లో వింత వ్యాధి కలకలం

10-01-2021 Sun 21:11
  • ఫిట్స్ తరహా లక్షణాలతో బాధపడుతున్న ప్రజలు
  • 12 గ్రామాల్లో ప్రభావం
  • ఒకరు మృతి, 120 మంది ఆసుపత్రుల్లో చేరిక
  • కల్తీ కల్లే కారణమంటున్న స్థానికులు
  • కల్లు కారణమా, కాదా అనే తేలుతుందన్న ఎమ్మెల్యే
 Mystery decease in Vikarabad

ఇటీవల ఏపీలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధి వందల మందిని అతలాకుతలం చేసిన సంగతి మరువక ముందే తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో వింత వ్యాధి కలకలం రేగింది. ఇప్పటివరకు ఒకరు మరణించగా 120 మంది ఆసుపత్రుల పాలయ్యారు. 12 గ్రామాల్లో ఒక్కసారి ప్రజలు ఫిట్స్ తో బాధపడుతూ ఆసుపత్రులకు క్యూలు కట్టారు. ఇప్పటివరకు 17 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా, బాధితులను ఎమ్మెల్యే ఆనంద్ పరామర్శించారు.

అయితే, ఈ వింతవ్యాధి లక్షణాలకు కల్లు కారణం కావొచ్చని ఓ వాదన వినిపిస్తోంది. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ, ప్రజలు మూర్ఛ లక్షణాలతో బాధపడుతుండడానికి కల్లు కారణమా, కాదా అనేది తేలుతుందని అన్నారు. పోలీసులు ఇప్పటికే 14 కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు. కల్లీ కల్లే అందుకు కారణం అని స్థానికులు ఆరోపిస్తుండడమే అందుకు కారణం.