బండి సంజయ్ కు నేనే వ్యాక్సిన్ వేశాను: తెలంగాణ మంత్రి పువ్వాడ కౌంటర్

10-01-2021 Sun 18:30
  • బండి సంజయ్ వ్యాఖ్యలకు పువ్వాడ కౌంటర్
  • టీఆర్ఎస్ పార్టీకి వ్యాక్సిన్ వేశామన్న సంజయ్
  • మీ వ్యాక్సిన్లు ఖమ్మంలో పనిచేయవన్న పువ్వాడ
  • ఇక్కడి ప్రజల్లో యాంటీబాడీలు బాగానే ఉన్నాయని వ్యాఖ్యలు
Telangana minister Puvvada Ajay counters Bandi Sanjay comments

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల వేళ కొందరు పర్యాటకులు వస్తుంటారని, అందులో భాగంగానే రాష్ట్రానికి ఓ బత్తాయి వచ్చిందని, ఆయన పేరు తొండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్ ఓట్లలో నాలుగు ఓట్ల కోసం ఆయన ఖమ్మంలో పర్యటించారని ఆరోపించారు.

"టీఆర్ఎస్ పార్టీపై వ్యాక్సిన్ ప్రయోగించామని వ్యాఖ్యలు చేస్తున్నారు... కానీ ఖమ్మంలో ఎలాంటి వ్యాక్సిన్లు పనిచేయవు. ఇక్కడి ప్రజల్లో యాంటీబాడీలు పుష్కలంగా ఉన్నాయి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్ పల్లి డివిజన్ లో 7 ఏడు కార్పొరేటర్ స్థానాల్లో 6 గెల్చుకుని బండి సంజయ్ కు నేనే వ్యాక్సిన్ వేశాను" అని పువ్వాడ వ్యాఖ్యానించారు.