కంపెనీలన్నీ జగన్ కు బైబై చెప్పేస్తున్నాయి: నారా లోకేశ్

09-01-2021 Sat 18:29
  • హెచ్ఎస్ బీసీ కంపెనీ వెళ్లిపోతోందని మీడియా కథనం
  • స్పందించిన లోకేశ్
  • ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శలు
  • జగన్ వైఖరి నిరుద్యోగులకు శాపం అని వ్యాఖ్యలు
Lokesh said companies leaves state

"విశాఖ నుంచి హెచ్ఎస్ బీసీ కంపెనీ జంప్?" అంటూ మీడియాలో వచ్చిన ఓ కథనంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. విశాఖలో పదేళ్ల కిందట ఏర్పాటైన హెచ్ఎస్ బీసీ ద్వారా 2 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి దక్కిందని, అలాంటి సంస్థ రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కంపెనీలన్నీ జగన్ కు బైబై చెప్పేస్తున్నాయని వెల్లడించారు.

విధ్వంసం, వైసీపీ నేతల బెదిరింపుల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన వారు, కంపెనీలు ఏర్పాటు చేసినవారు భయంతో పారిపోతున్నారని అన్నారు. జగన్ రెడ్డి ముఖం చూసి ఒక్క కంపెనీ రాలేదని, ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని లోకేశ్ వివరించారు. జగన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి నిరుద్యోగులకు శాపంగా మారిందని విమర్శించారు.