విక్రంకుమార్ 'థ్యాంక్యూ'లో పూజ హెగ్డే?

09-01-2021 Sat 16:08
  • గతంలో 'ఒక లైలా కోసం' సినిమాలో చైతు, పూజ
  • తాజాగా విక్రంకుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ'
  • హాకీ ఆటగాడిగా నటిస్తున్న నాగ చైతన్య   
Pooja Hegde in Vikram Kumars Thank you

నేటి బిజీ స్టార్ హీరోయిన్, టాలీవుడ్ అగ్ర కథానాయిక పూజ హెగ్డే తన కెరీర్ ప్రారంభంలో అక్కినేని నాగ చైతన్య సరసన ఓ సినిమాలో కథానాయికగా నటించింది. 'ఒక లైలా కోసం' పేరిట రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ మాత్రం పొందలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్లీ వీరిద్దరూ కలసి ఓ చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా 'థ్యాంక్యూ' పేరిట తాజాగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటించడానికి పూజ హెగ్డే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో చైతు హాకీ ప్లేయర్ గా నటిస్తున్నాడు. అలాగే, మహేశ్ బాబుకి అభిమానిగా కూడా కనిపిస్తాడని అంటున్నారు. ఇందులో మరో కథానాయికగా అవికా గోర్ కూడా నటిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.