ఉద్రిక్తంగా మారిన కేటీఆర్ పర్యటన

09-01-2021 Sat 13:32
  • ముషీరాబాద్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన కేటీఆర్
  • ప్రొటోకాల్ పాటించలేదని రచ్చ చేసిన బీజేపీ శ్రేణులు
  • కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకునేందుకు యత్నం
Tension raises in KTRs programme in Hyderabad

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాదులోని ముషీరాబాద్ లో ఈరోజు కేటీఆర్ పర్యటించారు. ముషీరాబాద్ లో నిర్మించిన ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి.

కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ పాటించలేదని బీజేపీ శ్రేణులు ఫైర్ అయ్యాయి. కేటీఆర్ కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. దీంతో, అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు కేటీఆర్ కాన్వాయ్ కి బీజేపీ కార్యకర్తలు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బీజేపీ కార్యకర్తలను నిలువరించి, పక్కకు తీసుకెళ్లారు. అనంతరం కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.