నేటి నుంచి బ్రిటన్ కు విమానాలు!

08-01-2021 Fri 09:11
  • 7వ తేదీ వరకూ విమానాలపై నిషేధం
  • ఆర్టీ పీసీఆర్ రిపోర్టు తప్పనిసరి
  • బ్రిటన్ లో కఠిన క్వారంటైన్ నిబంధనలు
Flights Resume to UK from Today

నేటి నుంచి బ్రిటన్ కు హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టు వర్గాలు స్పష్టం చేశాయి. ఇండియా నుంచి బ్రిటన్ కు విమానాల రాకపోకలపై 7వ తేదీ వరకూ విధించిన నిషేధం పూర్తయినందున శుక్రవారం నుంచి సర్వీసులను పునరుద్ధరించనున్నట్టు బ్రిటీష్ ఎయిర్ వేస్ తెలిపింది.

ఇదే సమయంలో ప్రయాణ సమయానికి మూడు రోజుల ముందుగా కరోనా నెగటివ్ ఉన్నట్టుగా ఆర్టీ పీసీఆర్ రిపోర్టు ప్రయాణికులకు తప్పనిసరని పేర్కొంది. కాగా, యూకేలో కొత్త కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తామని, విదేశీ ప్రయాణికులంతా నిబంధనల మేరకు క్వారంటైన్ కావాల్సిందేనని ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు.