వరవరరావు 13 వరకు ఆసుపత్రిలో చికిత్స పొందొచ్చు: బాంబే హైకోర్టు

08-01-2021 Fri 08:54
  • మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావు అరెస్ట్
  • గత నవంబరులో నానావతి ఆసుపత్రికి తరలింపు
  • ఆరోగ్యం మెరుగుపడిందంటూ కోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం
Bombay High Court agree to for treatment to varavarao till 13th

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన విరసం నేత వరవరరావు ఈ నెల 13 వరకు ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు బాంబే హైకోర్టు అనుమతి నిచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న 81 సంవత్సరాల వరవరావును గతేడాది నవంబరులో నానావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ నెల 13 వరకు ఆయన అక్కడే చికిత్స పొందవచ్చని జస్టిస్ ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా పేర్కొంది. తన భర్తకు బెయిలు ఇప్పించాలంటూ వరవరరావు భార్య హేమలత దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌ను 13న విచారించనున్నట్టు తెలిపింది. కాగా, వరవరరావు ఆరోగ్యం కొంత మెరుగుపడిందని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.