ఎవరికి నీవు జగనన్నవి.. నీవు సీఎం అనే విషయాన్ని గుర్తుంచుకో: బండారు సత్యనారాయణ

07-01-2021 Thu 14:10
  • రామతీర్థంపై విచారణకు క్రిస్టియన్ అధికారిని వేశారు
  • సునీల్ కుమార్ ఒక అసమర్థ అధికారి
  • సంతకాలు లేని పట్టాలను జనాలకు ఇస్తున్నారు
Who is Jagananna asks Bandaru Satyanarayana

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ఘటనపై విచారణ చేసేందుకు ఓ క్రిస్టియన్ అధికారి సునీల్ కుమార్ ను పంపించారని... ఇలా చేస్తూ హిందువుల మనోభావాలను ఎలా కాపాడగలుగుతారని ప్రశ్నించారు. సునీల్ కుమార్ ఒక అసమర్థ అధికారి అని అన్నారు. కేవలం ప్రభుత్వాన్ని కాపాడటానికే సునీల్ కుమార్ అక్కడకు వెళ్లినట్టు ఉందని దుయ్యబట్టారు.

ప్రతి దానికి జగనన్న అని పేరు పెట్టుకుంటున్నారని... ఎవరికి నీవు జగనన్నవి? అని సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. నీవు ముఖ్యమంత్రివి అనే విషయాన్ని గుర్తుంచుకో అని అన్నారు. ఎవరి సంతకాలు లేని ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారని... ఈ పట్టాలకు విలువ ఉందా? అని నిలదీశారు. దీనిపై విశాఖ జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ మోసంపై కోర్టుకు వెళ్తామని అన్నారు.