జోరు పెంచుతున్న బీజేపీ .. కాసేపట్లో హైదరాబాదుకు రానున్న బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుగ్

07-01-2021 Thu 10:04
  • ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న తరుణ్ చుగ్
  • అనంతరం బోధన్ కు పయనం
  • రేపు, ఎల్లుండి ఖమ్మం, వరంగల్ లలో పర్యటన
BJP TS incharge Tarun Chugh coming to Hyderabad

తెలంగాణలో ఇటీవలి కాలంలో బీజేపీ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ రాష్ట్ర పగ్గాలను చేపట్టిన తర్వాత జోరు మరింత పెరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కాషాయదళం పొలిటికల్ హీట్ పెంచుతోంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ కూడా ఈ మధ్య కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు, కాసేపట్లో తరుణ్ చుగ్ హైదరాబాదుకు రానున్నారు.

నగరానికి చేరుకున్న వెంటనే బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం బోధన్ కు వెళ్లనున్నారు. నిజామాబాద్, డిచ్ పల్లి మీదుగా ఆయన బోధన్ చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు బోధన్ లో జరిగే సభకు హాజరవుతారు .

అలాగే, రేపు ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ఖమ్మంలోని వీవీసీ ఫంక్షన్ హాల్లో మేధావులతో ఆయన భేటీకానున్నారు. అనంతరం బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలతో అంతర్గత సమావేశాలను నిర్వహిస్తారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇక 9వ తేదీన వరంగల్ లో ఆయన పర్యటన కొనసాగనుంది.