ఏపీ కరోనా అప్ డేట్: 289 కొత్త కేసులు, 3 మరణాలు

06-01-2021 Wed 20:50
  • గడచిన 24 గంటల్లో 51,207 పరీక్షలు  
  • అత్యధికంగా గుంటూరు జిల్లాలో 42 కేసులు
  • అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 2 పాజిటివ్ కేసులు
  • 428 మందికి కరోనా నయం
  • యాక్టివ్ కేసుల సంఖ్య 2,896
Covid details of Andhra Pradesh

ఏపీలో గడచిన 24 గంటల్లో  51,207 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 289 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 42, చిత్తూరు 40, విశాఖపట్నం జిల్లాల్లో 40 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 7, శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 428 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ముగ్గురు మరణించారు. కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 7,125కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,83,876 పాజిటివ్ కేసులు నమోదు కాగా; 8,73,855 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 2,896 మంది చికిత్స పొందుతున్నారు.