Centre: కరోనా వ్యాక్సిన్ యాప్ ఇంకా తీసుకురాలేదు... నకిలీ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలి: కేంద్రం

Centr warns about fake corona vaccine apps
  • కొవిన్ పేరుతో యాప్ తీసుకురానున్న కేంద్రం
  • అలాంటి పేర్లతోనే నకిలీలు
  • ప్రజలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
  • డౌన్ లోడ్ చేసుకోవద్దని వెల్లడి
  • త్వరలోనే అధికారిక యాప్ వస్తుందని వివరణ
కేంద్రం త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. అందుకోసం కొవిన్ (Co-WIN) పేరుతో యాప్ తీసుకురానుంది. అయితే, తాము తీసుకురాదలచిన యాప్ తరహాలోనే కొన్ని నకిలీలు యాప్ స్టోర్లలో దర్శనమిస్తుండడం పట్ల కేంద్రం స్పందించింది. తాము ఇంకా అధికారిక యాప్ తీసుకురాలేదని, నకిలీ యాప్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కొవిన్ అని ధ్వనించేలా కొన్ని నకిలీ యాప్ లను మోసపూరిత శక్తులు రూపొందించాయని, వాటిని చూసి మోసపోవద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. ఆ నకిలీ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దని, వాటిలో తమ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని స్పష్టం చేసింది. అధికారిక యాప్ త్వరలోనే ఆవిష్కరిస్తామని, దానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Centre
Fake Caorona Vaccine Apps
CoWIN
India

More Telugu News