Sake Sailajanath: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ అరెస్ట్

APCC President Sailajanath arrested
  • రామతీర్థంకు బయల్దేరిన శైలజానాథ్
  • మార్గమధ్యంలో అరెస్ట్ చేసిన పోలీసులు
  • మతాలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్న శైలజానాథ్
ఏపీలో హిందూ దేవాలయాలు, విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వమే దీనిక బాధ్యత వహించాలని విపక్షాలు అంటుంటే... ఈ ఘటనల వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనలపై టీడీపీ, బీజేపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ ఘటనలపై తమ ఆందోళన వ్యక్తం చేశాయి.

కాంగ్రెస్ పార్టీ ఆందోళనల్లో భాగంగా రామతీర్థంకు బయల్దేరిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల కోసం మతాలను వాడుకోవడం సరికాదని అన్నారు. రామతీర్థం ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని అన్నారు.
Sake Sailajanath
Congress
Arrest

More Telugu News