Sourav Ganguly: గంగూలీని ఈ రోజు డిశ్చార్జ్ చేయడం లేదు: ఉడ్ ల్యాండ్స్ ఆసుప‌త్రి వైద్యులు

  • ఆయ‌న‌ను రేపు డిశ్చార్జి చేస్తాం
  • మ‌రోరోజు ఆసుప‌త్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాల‌ని గంగూలీ భావిస్తున్నారు
  • ప్ర‌స్తుతం గంగూలీ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది
Sourav Ganguly now to be discharged from hospital on Thursday

గుండెపోటుకు గురై కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్స్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తామ‌ని నిన్న ఆసుప‌త్రి వైద్యులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌నను వైద్యులు ఈ రోజు డిశ్చార్జ్ చేయలేదు. ఆయ‌న‌ను రేపు ఆసుపత్రి నుంచి  డిశ్చార్జి చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రోరోజు ఆసుప‌త్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాల‌ని గంగూలీ భావిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం గంగూలీ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని తెలిపారు.

కాగా, గంగూలీ ఆరోగ్యం ప్ర‌స్తుతం నిలకడగా ఉండటంతో యాంజియోప్లాస్టీ వాయిదా వేయడమే సురక్షితమని వైద్యులు ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. రెండు లేదా మూడు వారాల త‌ర్వాత ఆయ‌న కోలుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పారు. అనంత‌రం ఆయ‌న చికిత్సకు సంబంధించి మ‌రో కోర్సు ప్రారంభిస్తామ‌ని చెప్పారు. డిశ్చార్జి అయిన అనంతరం గంగూలీ ఆరోగ్య ప‌రిస్థితిని ఆయ‌న ఇంట్లోనే ప‌ర్య‌వేక్షిస్తామ‌ని వివరించారు.

More Telugu News