portuguese: ఫైజర్ టీకా తీసుకున్న నర్సు.. 48 గంటల్లోనే మృతి!

  • పోర్చుగీసులో ఘటన
  • టీకా తీసుకున్న విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా చెప్పిన సోనియా
  • తన కుమార్తె ఎలా చనిపోయిందో చెప్పాలని సోనియా తండ్రి డిమాండ్
Portuguese nurse dies two days after getting Pfizer vaccine

కరోనా టీకా తీసుకున్న ఓ నర్సు 48 గంటల్లోనే మృతి చెందడం కలకలం రేపుతోంది. పోర్చుగల్‌లో జరిగిందీ ఘటన. తాను ఫైజర్/బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకాను వేయించుకున్నట్టు పోర్టోలోని పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలోని పీడియాట్రిక్ విభాగంలో పనిచేసే నర్సు సోనియా అసెవెడో (41) ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. అయితే, ఆ తర్వాత 48 గంటల్లోనే ఆమె మృతి చెందింది. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి.

గత నెల 30న ఆమెకు టీకా ఇచ్చామని, ఆ తర్వాత సోనియాలో ఎలాంటి అవాంఛనీయ లక్షణాలు కనిపించలేదని, పూర్తి ఆరోగ్యంగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నారు. ఆమె మృతికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపాయి. సోనియా మరణం తమను కలచివేసిందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఫైజర్ టీకాను తొలి విడతలో మొత్తం 538కి ఇవ్వగా అందులో సోనియా ఒకరు.

తల్లి మరణంపై సోనియా కుమార్తె వనియా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో కొంత ఇబ్బందిగా ఉందని మాత్రమే తనతో చెప్పిందని పేర్కొన్నారు. అంతే తప్ప మరెలాంటి సమస్య లేదని, ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పిందన్నారు.

సోనియా తండ్రి అబిలో అసెవెడో మాట్లాడుతూ.. ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, టీకా తీసుకున్న తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు. తన కుమార్తె ఎలా చనిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News