ఏపీ కరోనా అప్ డేట్: 377 కొత్త కేసులు, 4 మరణాలు

05-01-2021 Tue 19:43
  • గత 24 గంటల్లో 51,420 టెస్టులు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 82 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 5 కేసులు
  • యాక్టివ్ కేసుల సంఖ్య 3,038
Corona update for Andhra Pradesh

ఏపీలో గడచిన 24 గంటల్లో 51,420 కరోనా పరీక్షలు నిర్వహించగా, 377 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 82 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 66, గుంటూరు జిల్లాలో 60, విశాఖ జిల్లాలో 41 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 6, విజయనగరం జిల్లాలో 9 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 278 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 8,83,587 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,73,427 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,038 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,122కి చేరింది.