Jagan: ఆలయాలపై దాడులు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు: సీఎం జగన్

CM Jagan reacts to attacks on temples issue
  • స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో సమీక్ష
  • విగ్రహాల ధ్వంసం ఘటనలపై సీఎం స్పందన
  • రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా యుద్ధం జరుగుతోందని వెల్లడి
  • రాజకీయ దురుద్దేశంతోనే దాడులు అని ఆరోపణ
స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయాలపై దాడుల ఘటనల పట్ల తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా యుద్ధం జరుగుతోందని అన్నారు.

రాజకీయ దురుద్దేశాలతో అర్ధరాత్రి ఆలయాలపై దాడులు చేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా దాడిచేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అప్రదిష్ఠకు గురిచేయాలన్నదే వారి లక్ష్యమని, పోలీసులు పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేయాలని తెలిపారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని, రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తే గుణపాఠం చెప్పాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. మరొకరు ఇలాంటి పనులు చేయాలంటేనే భయపడాలని అన్నారు.
Jagan
Temples
Attacks
YSRCP
Andhra Pradesh

More Telugu News