Taj Mahal: తాజ్‌మహల్‌లో కాషాయ జెండాలు.. యువకుల అరెస్ట్!

Youth held waving saffron flags at Taj Mahal
  • తాజ్ మహల్ లో హల్ చల్ చేసిన హిందూ యువకులు
  • జై శ్రీరాం, హరహర మహాదేవ్ నినాదాలు
  • పట్టుకుని పోలీసులకు అప్పగించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది

ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరుగాంచిన తాజ్ మహల్ వద్ద ఈరోజు కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజ్ పరిసర ప్రాంతాల్లో కొందరు హిందూ యువకులు కాషాయ జెండాలను చేతబట్టి, జైశ్రీరాం నినాదాలు చేయడమే దానికి కారణం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.

మరోవైపు తాజ్ వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ప్రత్యక్ష సాక్షులు చెపుతున్న ప్రకారం... వారు కాషాయ జెండాలను పట్టుకుని తాజ్ మహల్ ప్రాంతంలోకి ప్రవేశించారు. అక్కడ ఓ రాతి బండపై కూర్చుని జెండాలు ఊపుతూ రచ్చ చేశారు. జైశ్రీరాం, శంభోశంకర హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News