shivraj singh chouhan: నేనైతే ఇప్పుడు టీకా తీసుకోలేను: స్పష్టం చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

  • కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతి
  • ప్రాధాన్య క్రమంలో ఉన్న వారికే తొలుత టీకా వేస్తామన్న సీఎం
  • వ్యాక్సినేషన్ కార్యక్రమంపై రాష్ట్రాల దృష్టి
will not get vaccinated first says Shivraj Singh Chouhan

తానైతే ప్రస్తుతానికి టీకా వేయించుకోవాలని అనుకోవడం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. తొలుత ప్రాధాన్య క్రమంలో ఉన్న వారికే  టీకా వేస్తామని, ఆ తర్వాతే తన వంతు అని పేర్కొన్నారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రాధాన్యత క్రమంలో ఉన్న వారికే తొలుత టీకా ఇస్తామని పునరుద్ఘాటించారు. అందుకోసమే తాము పనిచేయాలని అన్నారు. కాగా, కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మిగతా రాష్ట్రాలు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై దృష్టిసారించాయి. ఇందుకోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయి.

More Telugu News