Sonia Gandhi: టీపీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి... నేడు నిర్ణయం తీసుకోనున్న సోనియా గాంధీ!

Jeevan Reddy Name in TPCC President Race
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది. సీనియర్ నేత, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, నేడు సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. కాగా, ఈ పదవికి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, మధుయాష్కి గౌడ్, డీ రాజనర్సింహ తదితరుల పేర్లనూ పరిశీలించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Sonia Gandhi
TPCC
Jevan Reddy
President

More Telugu News