Sudhakar Komakula: సతీ సమేతంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్

 Life is beautiful fame Sudhakar met Megastar Chiranjeevi along with his wife Harika
  • తన భార్యతో కలిసి చిరు పాటకు డ్యాన్స్ చేసిన సుధాకర్
  • వీడియో చూసి అభినందించిన మెగాస్టార్
  • ఇవాళ తన ఇంటికి వచ్చిన జంటకు హార్దిక స్వాగతం
  • భవిష్యత్ లో అండగా ఉంటానని వెల్లడి
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో యువ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సుధాకర్ కోమాకుల. ఇటీవల సుధాకర్ తన అర్ధాంగి హారికతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటైన ఇందువదన కుందరదన సాంగ్ కు డ్యాన్స్ వీడియో రూపొందించాడు. ఆ వీడియో ద్వారా తన అభిమాన హీరో, తనలాంటి వారెందరికో స్ఫూర్తిప్రదాత అయిన చిరంజీవికి నీరాజనాలు అర్పించాడు. అప్పట్లో చిరంజీవి... సుధాకర్, హారిక జంటను మనస్ఫూర్తిగా అభినందించారు.

తాజాగా, సుధాకర్ తన అర్ధాంగి హారికతో కలిసి చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశాడు. తన ఇంటికి వచ్చిన ఆ యువజంటను చిరు హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఇందువదన పాటకు వారు చేసిన డ్యాన్స్ ను ఆయన ప్రశంసించారు. భవిష్యత్ లో వారి ప్రయత్నాలకు తాను అండగా ఉంటానని తెలిపారు.
Sudhakar Komakula
Chiranjeevi
Harika
Induvadana Song
Life Is Beautiful
Tollywood

More Telugu News