Bihar: లాలు తనయుడే భావి ప్రధాని.. యూపీ బాబా శ్రద్ధానంద మహరాజ్ జోస్యం

Tejashwi Yadav is the future PM of India
  • ప్రసాదం, భగవద్గీత పుస్తకాన్ని రబ్రీకి బహూకరించిన బాబా
  • తేజస్వీ యాదవ్ అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని అభయం
  •  శ్రద్ధానంద చెప్పినట్టే సీఎం అయిన అఖిలేశ్ యాదవ్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తనయుడే భావి ప్రధాని అని యూపీ బాబా శ్రద్ధానంద మహరాజ్ చెప్పారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వారణాసిలోని తన ఆశ్రమం నుంచి పాట్నాలోని లాలు ఇంటికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రసాదం, భగవద్గీత పుస్తకాన్ని లాలు భార్య రబ్రీదేవికి బహూకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దేశానికి భవిష్యత్ ప్రధాని తేజస్వీయేనని పేర్కొన్నారు. ఏదో ఒకరోజు దేశానికి ఆయన ప్రధాని కావడం ఖాయమన్నారు. తేజస్వీ యాదవ్ ఎదుర్కొంటున్న కొన్ని ఆటంకాలు త్వరలోనే తొలగిపోతాయని అభయం ఇచ్చారు. కాగా, సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రి అవుతారంటూ గతంలో ఆయన చెప్పిన మాటలు నిజం కావడంతో ఆయన మాటలపై రాజకీయ నేతలకు విపరీతమైన  విశ్వాసం. కాగా, శ్రద్ధానంద మహరాజ్ తనకు ఇచ్చిన ప్రసాదాన్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్తకు రబ్రీదేవి పంపించారు.
Bihar
Tejashwi Yadav
Prime Minister
India

More Telugu News