AP Police: మా హీరోయిన్లు వీళ్లే... ఏపీ పోలీస్ విభాగం ఆసక్తికర పోస్టు

  • తిరుపతిలో రేపట్నించి పోలీస్ డ్యూటీ మీట్
  • కిరీటం ఉంటేనే మహారాణి కాదన్న పోలీస్ డిపార్ట్ మెంట్
  • కొందరు మహారాణులు యూనిఫాంలోనూ ఉంటారని వెల్లడి
  • అత్యుత్తమ మహిళా పోలీసాఫీసర్లు అంటూ ట్వీట్

AP Police department tweets about women cops

రాష్ట్రంలో మహిళల రక్షణ, సైబర్ భద్రత అంశాలపై తిరుపతిలో రేపటి నుంచి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ ఆసక్తికర పోస్టు చేసింది.

"ప్రతి మహారాణి కిరీటం ధరించకపోవచ్చు, రాచరిక దుస్తుల్లో కనిపించకపోవచ్చు... కానీ కొందరు మహారాణులు టోపీలు పెట్టుకుంటారు, యూనిఫాం ధరిస్తారు. వీళ్లే మా హీరోయిన్లు... అత్యుత్తమ మహిళా పోలీసాఫీసర్లు" అంటూ వివరించింది.

ఈ వ్యాఖ్యలకు తగిన విధంగా కొందరు మహిళా పోలీస్ అధికారుల గ్రూప్ ఫొటోను కూడా పంచుకుంది. వృత్తికే అంకితమై విధులు నిర్వర్తిస్తున్న అధికారిణులు అంటూ ఏపీ పోలీస్ విభాగం కొనియాడింది. ఏపీ పోలీస్ ఎంతో భద్రమైన సేవలు అందిస్తూ, గర్వించదగ్గ రీతిలో పనిచేస్తుందని ఆ పోస్టులో పేర్కొన్నారు.

More Telugu News