Manthena Satyanarayana Raju: అశోక్ గజపతిరాజును అలా సంబోధించడం నీ అహంకారానికి నిదర్శనం: మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన ఆగ్రహం

TDP MLC Mantena gets anger on YCP Minister Vellampalli
  • రామతీర్థం ట్రస్టు చైర్మన్ గా అశోక్ తొలగింపు
  • ఇలాంటి వెధవను పదవిలో ఉంచాలా? అంటూ వెల్లంపల్లి వ్యాఖ్య 
  • నాలుక కోస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చిన మంతెన
  • చేతగాని మంత్రి అంటూ వ్యాఖ్యలు
  • ఒక్కర్ని కూడా పట్టుకోలేకపోయారని విమర్శలు
రామతీర్థం, మందవల్లి, పైడితల్లి దేవస్థానాల ట్రస్టు చైర్మన్ బాధ్యతల నుంచి టీడీపీ నేత అశోక్ గజపతిరాజును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. విగ్రహం తల పగలగొట్టిన ఇలాంటి వెధవను పదవిలో ఉంచాలా? అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఇవాళ టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఘాటుగా స్పందించారు.

పదవిని కాపాడుకునేందుకు నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని మంత్రి వెల్లంపల్లిని హెచ్చరించారు. పేదల సంక్షేమం కోసం రూ.14 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులను ఉదారంగా ఇచ్చేసిన అశోక్ గజపతిరాజును వెధవ అని సంబోధించడం నీ అహంభావానికి నిదర్శనం అని మండిపడ్డారు. భూదానం చేసిన అశోక్ గజపతిరాజును ఏకవచనంతో మాట్లాడతావా? అని ప్రశ్నించారు.

దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి వచ్చాక వేల ఎకరాల దేవుడి మాన్యం భూములు అన్యాక్రాంతం చేశారు... విజయవాడ దుర్గగుడిలో వెండి సింహాలు నీ పర్యవేక్షణలోనే మాయం అయ్యాయన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. వెల్లంపల్లి వంటి అసమర్థుడికి దేవాదాయ శాఖ ఇచ్చినందుకు ఆ దేవుడు కూడా చింతిస్తుంటాడని ఎమ్మెల్సీ మంతెన వ్యాఖ్యానించారు. గత 19 నెలలుగా రాష్ట్రంలో 125 ఆలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని కూడా పట్టుకోలేకపోవడం మంత్రి చేతగానితనానికి నిదర్శనం అని స్పష్టం చేశారు.
Manthena Satyanarayana Raju
Vellampalli Srinivasa Rao
Ashok Gajapathi Raju
Trust Chairman
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News