Ashok Gajapathi Raju: రామతీర్ధం, పైడితల్లి, మందపల్లి దేవాలయాల చైర్మన్ పదవుల నుంచి అశోక్ గజపతిరాజు తొలగింపు 

  • ఏపీలో రగులుతున్న విగ్రహాల ధ్వంసం వ్యవహారం
  • టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్
  • కీలక నిర్ణయం తీసుకున్న వైసీపీ ప్రభుత్వం
  • మూడు ఆలయాల ట్రస్టు చైర్మన్ బాధ్యతల నుంచి అశోక్ తొలగింపు
AP Government removes Ashok Gajapathi Raju from three temples trust chairman duties

రామతీర్థం ఘటన నేపథ్యంలో తమను ఇరుకునపడేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తుండడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్రలో మూడు సుప్రసిద్ధ ఆలయాలకు ట్రస్టు చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత అశోక్ గజపతిరాజుపై వేటు వేసింది. రామతీర్థం రామస్వామి ఆలయ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మందపల్లి మందేశ్వరస్వామి ఆలయం, విజయనగరం పైడితల్లి ఆలయాల ట్రస్టు చైర్మన్ బాధ్యతల నుంచి కూడా అశోక్ గజపతిని తొలగిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అశోక్ గజపతిరాజు తన చట్టబద్ధమైన బాధ్యతల నుంచి వైదొలగడంలోనూ, రామతీర్థం ఆలయ భద్రత అంశాల్లోనూ, విగ్రహ ధ్వంసం ఘటనల నివారణలోనూ విఫలమయ్యారని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. ఈ కారణాలతో ఆయనను ఆయా ట్రస్టుల చైర్మన్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు స్పష్టం చేశారు.

More Telugu News