Budda Venkanna: ఆ ఘటన చూస్తుంటే విజ‌య‌సాయిరెడ్డి ఈ రోజు చేస్తున్న హడావిడి గుర్తొస్తుంది: బుద్ధా వెంక‌న్న‌

budda venkanna slams vijay sai reddy
  • క‌ర్నూలు జిల్లా పొనకల్లు వీరాంజనేయ స్వామి విగ్రహాల ధ్వంసం
  • వైసీపీ నేత దామోదర్ రెడ్డే అసలైన దొంగ అని తేలింది
  • ఇదంతా వైసీపీ నేతలే చేస్తున్నారు
ఇటీవ‌ల క‌ర్నూలు జిల్లా పొనకల్లు వీరాంజనేయ స్వామి విగ్రహాలు ధ్వంసం చేసి ఏమీ తెలియ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించిన వైసీపీ నేత దామోదర్ రెడ్డే ఆ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న ఓ వీడియోను పోస్ట్ చేశారు.

'క‌ర్నూలు జిల్లా పొనకల్లు వీరాంజనేయ స్వామి విగ్రహాలను ధ్వంసం చేయ‌డం దారుణమ‌ని, వెంటనే అరెస్ట్ చెయ్యాలని హడావుడి చేసిన వైకాపా నేత దామోదర్ రెడ్డే అసలైన దొంగ అని తేలింది. ఈ ఘటన చూస్తుంటే విజ‌య‌సాయిరెడ్డి ఈ రోజు చేస్తున్న హడావిడి గుర్తొస్తుంది' అని బుద్ధా వెంక‌న్న ట్వీట్ చేశారు.

'ఈ రాష్ట్రంలో హిందూ మతంపై స్టేట్ స్పాన్సర్డ్ దాడి జరుగుతుంది. ఇదంతా వైసీపీ నేతలే చేస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ దీనికి హెడ్. డీజీపీ గారు విజయసాయి రెడ్డిని లోపల వేసి నాలుగు పీకితే మొత్తం కుట్ర బయటకు వస్తుంది. విజయసాయి రెడ్డి ఎందుకు నిన్నటి నుంచి భుజాలు తడుముకుంటున్నాడో బయటపడుతుంది' అని పేర్కొన్నారు. 
Budda Venkanna
Telugudesam
YSRCP

More Telugu News