COVAXIN: కొవాగ్జిన్ సమర్థత విషయంలో ఎటువంటి సందేహాలు లేవు: భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర

  • అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అభివృద్ధి చేస్తున్నాం
  •  3,000 మంది శాస్త్ర‌వేత్త‌లు, ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు
  • తొమ్మిది నెలలుగా కష్టపడుతున్నారు
  • 26 వేల మంది వలంటీర్లతో క్లినికల్ ప్ర‌యోగాలు
no doubt on covaxin efficacy

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. దీనిపై భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల స్పందించారు. హైద‌రాబాద్ లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... ఆ వ్యాక్సిన్‌ నాణ్యత, సమర్థత విషయంలో ఎటువంటి సందేహాలు లేవ‌ని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తాము బెస్ట్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నామని అన్నారు.

ఇందుకోసం 3,000 మంది శాస్త్ర‌వేత్త‌లు, ఉద్యోగులు తొమ్మిది నెలలుగా కష్టపడి పని చేస్తున్నారని ఆమె చెప్పారు. భార‌త్ లో 26 వేల మంది వలంటీర్లతో క్లినికల్ ప్ర‌యోగాలు చేస్తున్నామ‌ని తెలిపారు. త‌మ వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని నిపుణుల బృందానికి అందించామని చెప్పారు. అలాగే, ఆన్‌లైన్‌లో కేంద్రానికి పంపిస్తున్నామన్నారు.

వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అత్యవసర వినియోగానికి అనుమ‌తులు వ‌చ్చిన అనంత‌ర‌మే ఎన్ని డోసులు ఉత్ప‌త్తి చేయాలన్న‌దానిపై స్పష్టత వస్తుందని అన్నారు.

More Telugu News