TikTok: 'టిక్‌టాక్'పై బ్రిటన్‌ కోర్టులో బాలిక కేసు

  • వ్యక్తిగత గోప్యత విషయంలో నిబంధనల  ఉల్లంఘన
  • బాలిక వివరాలను గోప్యంగా ఉంచుతూ కేసు దాఖలు
  • తన వ్యక్తిగత సమాచారం బహిర్గతమైందన్న బాలిక
girl files case on tiktok

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని అత్యధిక డౌన్‌లోడ్లతో దూసుకుపోతోన్న టిక్‌టాక్ పై ఓ 12 ఏళ్ల బాలిక కేసు వేసి వార్తల్లో నిలిచింది. వ్యక్తిగత గోప్యత విషయంలో యూరోపియన్ యూనియన్ నిబంధనలను టిక్‌టాక్‌ ఉల్లంఘించిందని బ్రిటన్ కు చెందిన ఆ బాలిక ఆరోపించింది. ఆమె వివరాలను గోప్యంగా ఉంచుతూ కేసును దాఖలు చేసేందుకు స్థానిక కోర్టు  అనుమతి ఇచ్చింది.

ఇంగ్లాండ్‌లో టిక్‌టాక్‌ను ఉపయోగించే బాలబాలికలకు ఈ కేసు మరింత రక్షణ  కల్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టిక్‌టాక్ యాప్‌లో డేటా రక్షణ లోపం ఉందని, ఈ కారణంగా తన వ్యక్తిగత సమాచారం బహిర్గతమైందని ఆ బాలిక చెప్పింది. ఆమె వాదనతో కోర్టు ఏకీభవించి తదుపరి విచారణకు ఆదేశించింది.

కాగా, ఆ యాప్ పై చట్టపరమైన చర్యలకు ఇంగ్లండ్ పిల్లల కమిషనర్ ఎన్నే లాంగ్ఫీల్డ్ కూడా మద్దతు తెలుపుతున్నారు. టిక్‌టాక్ యాప్ పై ఇప్పటికే భారత్, అమెరికాతో పాటు పలు దేశాల్లోనూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

More Telugu News