జనవరి 2 నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాక్సిన్ డ్రై రన్
- ఉన్నత స్థాయి సమీక్షలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
- ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో విజయవంతం
- కొవిన్ ప్లాట్ ఫాంను సమర్థంగా మార్చేందుకు రాష్ట్రాల సలహాలు
‘‘వ్యాక్సిన్ వినియోగ కార్యకలాపాలు, పారదర్శకంగా వ్యాక్సిన్ పంపిణీ జరిగేందుకు టెక్నాలజీని వాడడం వంటి విషయాలపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. వ్యాక్సిన్ పంపిణీకి తయారు చేసిన కొవిన్ ప్లాట్ ఫాంను మరింత సమర్థంగా మార్చేందుకు రాష్ట్రాల సలహాలు తీసుకుంటున్నాం. వాటి ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీకి సమగ్రమైన మార్గదర్శకాలు ఇవ్వడానికి, పంపిణీ చర్యలను కట్టుదిట్టం చేయడానికి వీలుంటుంది’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.