Honda: ద్విచక్ర వాహనాలపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, స్పెషల్ ఆఫర్లను ప్రకటించిన హోండా!

Honda announces special offers and cash back for two wheelers
  • యూనికార్న్ బైక్ పై రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్
  • క్యాష్ బ్యాక్ పొందేందుకు కండిషన్ పెట్టిన హోండా
  • పార్టనర్ బ్యాంకుల నుంచి ఫైనాన్స్ తీసుకునే వారికే క్యాష్ బ్యాక్ ఆఫర్
టూ వీలర్ కొనాలనుకుంటున్న వారికి హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. పలు వేరియంట్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్లను, స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. హార్నెట్ 2.0, యాక్టివా 6జీ, సీడీ 110 డ్రీమ్, గ్రేజియా 125, ఎస్పీ 125 తదితర వాహనాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. యూనికార్న్ బైక్ పై రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చింది. అయితే, క్యాష్ బ్యాక్ పొందాలంటే మాత్రం కండిషన్స్ అప్లై అంటూ ఒక మెలిక పెట్టింది. తన పార్టనర్ బ్యాంకుల నుంచి ఫైనాన్స్ తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని ప్రకటించింది. యూనికార్న్ 160 మోటార్ బైక్ ధర రూ. 95,152 (ఢిల్లీ ఎక్స్ షోరూం)గా ఉంది.
Honda
Two Wheeler
Cash Back
Special Offers

More Telugu News