nagababu: తన కూతురు, అల్లుడికి కరోనా సోకలేదని చెప్పిన నాగబాబు

Nagababu say Both the reports have confirmed negative for covid
  • ప్రభుత్వ కరోనా నిబంధనల ప్రకారం పరీక్షలు చేయించుకున్నారు
  • ఈ నెల 26న మాల్దీవులకు వెళ్లకముందు పరీక్షలు
  • 29న ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత టెస్టులు  
  • నిహారిక, చైతన్యకు కరోనా నెగిటివ్
మెగా ఫ్యామిలీని కరోనా భయం వెంటాడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా, రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్‌కు కరోనా సోకింది. ఇటీవల మెగా కుటుంబం నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వేడుకలో పాల్గొంది. దీంతో కరోనా ఇతర కుటుంబ సభ్యులకూ సోకే అవకాశం ఉండడంతో వారు టెస్టులు చేయించుకుంటున్నారు.

తన కూతురు, అల్లుడు నిహారిక, చైతన్యలకు కరోనా సోకలేదని నాగబాబు స్పష్టం చేశారు. వారిద్దరూ ఇటీవలే హనీమూన్ ట్రిప్పును ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కరోనా నిబంధనల ప్రకారం నిహారిక, చైతన్య కరోనా పరీక్షలు చేయించుకున్నారని పేర్కొన్నారు. ఈ నెల 26న మాల్దీవులకు వెళ్లకముందు, 29న ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. వారిద్దరికీ నెగిటివ్ వచ్చిందని వివరించారు.
nagababu
Tollywood
Niharika Konidela

More Telugu News