sunita: తన పెళ్లి తేదీని స్వయంగా ప్రకటించిన సింగర్ సునీత

  • డిజిటల్ మీడియా ప్రముఖుడు రామ్ వీరపనేనితో వివాహం
  • వచ్చే నెల 9వ తేదీన పెళ్లి
  • శ్రీవారిని దర్శించుకుని చెప్పిన సునీత
singer sunita announces her marriage date

డిజిటల్ మీడియా ప్రముఖుడు రామ్ వీరపనేనిని  ప్రముఖ గాయని సునీత పెళ్లాడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెల 9వ తేదీన తన వివాహం జరగనుందని సునీత స్వయంగా ప్రకటించింది.

ఈ రోజు ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన నూతన జీవితం బాగుండాలని స్వామి వారిని ప్రార్థించానని తెలిపింది. కరోనా విజృంభణ నేపథ్యంలో గత తొమ్మిది నెలలుగా తాను శ్రీవారిని దర్శించుకోలేకపోయానని చెప్పింది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొంది.

కాగా, వారి వివాహం కొద్ది మంది బంధుమిత్రుల మ‌ధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఈ  నెల‌లోనే పెళ్లి చేసుకోవాల‌ని భావించారు. అయితే, ఇద్ద‌రి జాత‌కాల ప్ర‌కారం స‌రైన ముహూర్తాలు లేక‌పోవ‌డంతో వచ్చేనెలకు పెళ్లి వాయిదా పడినట్లు తెలిసింది. 19 ఏళ్ల  వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్న సునీత అనంతరం భ‌ర్త నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్ప‌టి నుండి తన పిల్లల‌తో ఆమె వేరుగా ఉంటున్నారు.

More Telugu News