Sensex: నేడు కూడా లాభాల్లోనే ముగిసిన మార్కెట్లు

  • 133 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 49 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ అల్ట్రాటెక్ సిమెంట్ షేర్
Stock markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ... మధ్యాహ్నం తర్వాత మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఆటో, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్ల అండతో ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 133 పాయింట్లు లాభపడి 47,746కి చేరింది. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 13,982 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (4.11%), బజాజ్ ఫైనాన్స్ (2.63%), మారుతి సుజుకి (2.11%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.93%), టెక్ మహీంద్రా (1.78%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.62%), సన్ ఫార్మా (-1.08%), యాక్సిస్ బ్యాంక్ (-0.84%), భారతి ఎయిర్ టెల్ (-0.83%), టీసీఎస్ (-0.74%).

More Telugu News