Sonusud: నిర్మాతగా కూడా మారుతున్న సోనూసూద్!

Sonusud turns as producer
  • లాక్ డౌన్ లో ఎంతోమందికి సాయం చేసిన సోనూ 
  • నిజజీవితంలో హీరో అయిన వెండితెర విలన్
  • ఇమేజ్ మారడంతో క్యారెక్టర్లు మారుస్తున్న వైనం  
  • ప్రజలలో స్ఫూర్తిని నింపే చిత్రాల నిర్మాణం
సోనూసూద్.. ఆయన వెండితెర విలన్.. ఇప్పుడు నిజజీవితంలో హీరో! ఆపదలో వున్న వారిని ఎలా ఆదుకోవాలో ఆచరణలో చేసి చూపించిన మానవత్వమున్న మనిషి సోనూసూద్.

ఆమధ్య ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సమయంలో దేశంలోని ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వలస కార్మికులను తన సొంత ఖర్చులతో వారి వారి స్వస్థలాలకు చేర్చిన వ్యక్తి. అలాగే కష్టాలలో వున్న ఎంతోమందికి తానున్నానంటూ అభయాస్తం ఇస్తూ, ఆదుకుంటున్న పెద్దమనసున్న మనిషి.

అందుకే ఆయన వెండితెరకు విలన్ అయినా, రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయ్యారు. దీంతో ఆయన ఇమేజ్ మారిపోవడంతో ఆయా సినిమాలలో ఆయన పోషిస్తున్న క్యారెక్టర్లను కూడా అందుకు అనుగుణంగా మారుస్తున్న సందర్భాలను కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం.

ఇదిలావుంచితే, ఇప్పుడీ నటుడు నిర్మాతగా కూడా మారుతున్నాడు. త్వరలో సొంత చిత్ర నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్టు తాజాగా ఆయన వెల్లడించారు. "ప్రజలలో స్ఫూర్తిని నింపే కథలతో చిత్రాలు నిర్మించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు నిర్మాతగా మారుతున్నాను. అలాంటి కథల కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మా సంస్థ నుంచి సినిమా వస్తుంది" అని చెప్పారు సోనూసూద్.
Sonusud
Lockdown
Migrated labour

More Telugu News