Indian Railways: విమానాల్లోని సౌకర్యాలను తలపించేలా రైళ్లలో సౌకర్యాలు.. వీడియో ఇదిగో

railway minister tweet goes viral
  • రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు
  • అన్ని రకాల సౌకర్యాలతో రైలు బోగీల డిజైన్
  • కొత్త విస్తాడోమ్ బోగీల్లో సదుపాయాలు
  • రైల్వే మంత్రి ట్వీట్
రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తూ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు రైల్వే శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రైలు బోగీలను అన్ని రకాల సౌకర్యాలతో డిజైన్ చేస్తోంది. రైళ్లలోని సదుపాయాలను తెలుపుతూ  రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ప్రయాణాలను మన జ్ఞాపకాల్లో కొలవాలి, అంతేగానీ మైళ్లలో కాదంటూ ఆయన అన్నారు.

'భారతీయ రైల్వే తయారు చేస్తున్న కొత్త విస్తాడోమ్ బోగీలు ఇవీ..' అంటూ ఆయన ట్వీట్ చేశారు. వీటిలో ప్రయాణిస్తే కచ్చితంగా మర్చిపోలేని అనుభవాన్ని పొందుతారని ఆయన తెలిపారు. విస్తాడోమ్ బోగీల్లో సీట్లు చూస్తే విమానం గుర్తుకు వస్తుంది. ప్రయాణికులకు చాలా సౌకర్యకరంగా ఉండేలా సీట్లను అమర్చారు. భారతీయ రైల్వే చేస్తోన్న కృషిని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Indian Railways
Viral Videos
Piyush Goyal

More Telugu News