Pawan Kalyan: వకీల్ సాబ్ సెట్స్ లో ఉల్లాసభరితంగా పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan wraps up his part in Vakeel Saab
  • వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్న పవన్
  • పవన్ పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తి
  • యూనిట్ సభ్యులతో పవన్ ఫొటోలు
  • నెట్టింట సందడి చేస్తున్న ఫొటోలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. తాజాగా ఈ చిత్రంలో పవన్ పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా పవన్ సెట్స్ లో ఉల్లాసంగా గడిపారు. చిత్ర యూనిట్ సభ్యులతో సంతోషాన్ని పంచుకున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తోనూ, నిర్మాత దిల్ రాజుతోనూ... ఇతర యూనిట్ సభ్యులందరితోనూ ఫొటోలు దిగారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలు వైరల్ గా మారి, సందడి చేస్తున్నాయి. పోలీస్ అని రాసివున్న ఆర్మర్ ను పవన్ తదేకంగా చూస్తున్న ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది.

బాలీవుడ్ లో హిట్టయిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ రీమేక్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవన్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కీలక పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నటిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Pawan Kalyan
Vakeel Saab
Shooting
Tollywood

More Telugu News