Anurag Basu: ఆ రెండో కంగన గురించి నాకు ఏమాత్రం తెలియదు: దర్శకుడు అనురాగ్ బసు

Bollywood director Anurag Basu opines on Kangana Ranaut
  • గ్యాంగ్ స్టర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కంగన
  • గ్యాంగ్ స్టర్ ను తెరకెక్కించిన అనురాగ్ బసు
  • ఇద్దరు కంగనాలు ఉన్నారన్న బసు
  • తనకు తెలిసిన కంగన వేరని వ్యాఖ్యలు
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న కంగన రనౌత్ పై ఆమె మొదటి చిత్రం దర్శకుడు అనురాగ్ బసు తన అభిప్రాయాలు వెల్లడించారు. కంగన 2006లో వచ్చిన గ్యాంగ్ స్టర్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఆ సినిమాకు అనురాగ్ బసు దర్శకుడు.

తాజాగా బసు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వ్యక్తిగతంగా తనకు తెలిసిన కంగన వేరని అన్నారు. కంగన ప్రతిభ గురించి గ్యాంగ్ స్టర్ సమయంలోనే అర్థమైందని తెలిపారు. చాలా విభిన్నమైన వ్యక్తి అని తెలుసుకున్నానని, ఏ విషయాన్నయినా ఇట్టే గ్రహించేదని వెల్లడించారు.

అయితే తనకు తెలిసినంతవరకు ఇప్పుడున్న కంగన, గతంలో ఉన్న కంగన మధ్య ఎంతో తేడా ఉందని చెప్పారు. చూస్తుంటే ఇద్దరు కంగనాలు ఉన్నట్టు అనిపిస్తోందని, వారిలో ఒక కంగన గురించి తనకు తెలుసుని, ఈ రెండో కంగన గురించి తనకేమీ తెలియదని, అసలేమాత్రం అర్థం కాదని బసు వ్యాఖ్యానించారు. తాము కలుసుకోవడం చాలా తక్కువ అని, ఎప్పుడన్నా కలిస్తే చాలా సరదాగా ఉంటుందని వెల్లడించారు.
Anurag Basu
Kangana Ranaut
Gangster
Bollywood

More Telugu News