Biyyapu Madhusudan Reddy: సీపీఐ పోరాటాలన్నీ బెత్తెడు స్థలాల కోసమే కదా... నారాయణపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

YCP MLA Biyyapu Madhusudan Reddy fires on CPI Narayana
  • నారాయణపై బియ్యపు మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలు
  • నారాయణకు దమ్ముంటే శ్రీకాళహస్తి రావాలని సవాల్
  • సెంటు కంటే తక్కువ స్థలంలో బతుకుతున్నారని వెల్లడి
  • అలాంటి వాళ్లు వేలమంది ఉన్నారన్న బియ్యపు
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, వైసీపీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి సీపీఐ అగ్రనేత నారాయణపై ధ్వజమెత్తారు. సీపీఐ పోరాటాలన్నీ బెత్తెడు స్థలాల కోసమే కదా అని విమర్శించారు. నారాయణకు దమ్ముంటే శ్రీకాళహస్తికి రావాలని సవాల్ విసిరారు. ఇక్కడ సెంటు కంటే తక్కువ స్థలంలో నివసిస్తున్న వేలమందిని చూపిస్తానని స్పష్టం చేశారు.

31 లక్షల మందికి ఇళ్లు ఇచ్చి జగన్ రికార్డు సృష్టిస్తున్నారని, జగన్ ఇళ్లు కాదు, గుళ్లు కట్టించి ఇస్తున్నారని కీర్తించారు.  ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి టీడీపీ అధినాయకత్వంపైనా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ లను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వచ్చాయని అన్నారు.
Biyyapu Madhusudan Reddy
CPI Narayana
Jagan
Chandrababu
Nara Lokesh
Srikalahasti

More Telugu News