నెట్ ఫ్లిక్స్ సినిమా 'త్రిభంగ'.. ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటి కాజోల్!
- 'త్రిభంగ'తో కాజోల్ డిజిటల్ రంగ ప్రవేశం
- రేణుక దర్శకత్వంలో రూపొందిన సినిమా
- మూడుతరాలకు చెందిన మహిళల కథ
- జనవరిలో విడుదలకు సన్నాహాలు
ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ కూడా డిజిటల్ రంగ ప్రవేశం చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించిన 'త్రిభంగ' అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని ఆమె భర్త అజయ్ దేవగణ్ నిర్మించడం ఒక విశేషమైతే.. ప్రముఖ నటి రేణుకా సహానీ దీనికి దర్శకత్వం వహించడం మరో విశేషం.
ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల మహిళల మధ్య సాగే అందమైన అనుభూతులు, భావోద్వేగాలతో సాగే కథతో ఈ 'త్రిభంగ' చిత్రాన్ని రూపొందించారు. ఇది ముగ్గురు మహిళలకు చెందిన ఆసక్తికరమైన కథ అనీ, వచ్చే నెలలో ఇది విడుదలవుతుందని కాజోల్ చెప్పింది. ఇక జనవరిలో ఎప్పుడు విడుదల చేసేది నెట్ ఫ్లిక్స్ త్వరలోనే ప్రకటిస్తుంది.