Salman Khan: నేను అపార్ట్ మెంట్ లో లేను... నా కోసం ఎవరూ రావొద్దు: సల్మాన్ ఖాన్

Salman Khan urges fans do not come to his apartment
  • రేపు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు
  • కరోనా కాచుకుని ఉందని వెల్లడి
  • ఫ్యాన్స్ తన నివాసం వద్ద గుమికూడవద్దని విజ్ఞప్తి
  • అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
  • గేటుకు నోటీసు అంటించిన వైనం
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. ఆదివారం ఆయన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తన కోసం అభిమానులు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. తాను అపార్ట్ మెంట్ లో ఉండడం లేదని వెల్లడించారు. తన ఇంటి వద్ద దయచేసి అభిమానులెవరూ గుమికూడవద్దని కోరారు. ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చూపే ప్రేమాభిమానాలు తనను కట్టిపడేసేవని, కానీ ఈసారి కరోనా మహమ్మారి కాచుకుని ఉందని తెలిపారు.

అభిమానులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు. ఈ మేరకు ముంబయిలో సల్మాన్ తాను నివసించే గెలాక్సీ అపార్ట్ మెంట్ గేటు వద్ద భారీ నోటీసు అంటించారు. దేశంలో లాక్ డౌన్ ప్రకటించాక సల్మాన్ ఖాన్ తన ఫాంహౌస్ కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అక్కడినుంచే ఆయన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
Salman Khan
Fans
Apartment
Birthday
Corona Virus

More Telugu News