టీపీసీసీ చీఫ్‌గా రేవంత్.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడిగా కోమటిరెడ్డి?
- రేవంత్‌రెడ్డి పేరు దాదాపు ఖరారు
- ఏఐసీసీలోకి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- సీఎల్పీ నేతగా శ్రీధర్‌బాబు
- దాదాపు నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం
మరోవైపు, పీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వమంటూ ఇటీవల అధిష్ఠానాన్ని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా చోటు కల్పించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఏఐసీసీలోకి తీసుకోనుండగా, సంపత్‌కుమార్‌ను ఎస్సీ కోటాలో, మధుయాష్కీగౌడ్‌ను బీసీ కోటాలో, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించనున్నట్టు తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్ రేసులో చివరి వరకు ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును సీఎల్పీ నేతగా నియమించనున్నట్టు సమాచారం. కోమటిరెడ్డి కనుక ప్రచార కమిటీ పదవిని ఆశిస్తే కనుక భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా కొనసాగించి, శ్రీధర్ బాబును కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ, లేదంటే ఏఐసీసీలోకి కానీ తీసుకోవాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.