Urmila Matondkar: కాంగ్రెస్ పార్టీతో వున్న కొద్దిపాటి అనుబంధం పట్ల చింతిస్తున్నా: సినీ నటి ఊర్మిళ

  • ఇటీవలే శివసేనలో చేరిన ఊర్మిళ
  • ఏసీ రూముల్లో కూర్చుని ట్వీట్లు చేయడం తనకిష్టంలేదని వెల్లడి
  • ప్రజా నాయకురాలిగా ఎదగాలని ఆకాంక్ష
  • అందుకే శివసేనలోకి వచ్చానని ఉద్ఘాటన
Urmila Matondkar opines on her stint with Congress

ప్రముఖ నటి ఊర్మిళ మాటోండ్కర్ ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి శివసేన తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో తనకున్న కొద్దిపాటి అనుబంధం పట్ల చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఏసీ రూముల్లో కూర్చుని ట్వీట్లు చేసే రాజకీయనేతగా ఉండడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.

 తాను ప్రజల అభిమానంతోనే సినీ నటిగా ఎదిగానని, ఆ కోవలోనే ప్రజా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నానని వివరించారు. అందుకే శివసేన పార్టీలోకి వచ్చానని వెల్లడించారు. కులం, మతం పట్టించుకోనని, ప్రజల కోసమే పనిచేస్తానని ఊర్మిళ చెప్పుకొచ్చారు.

ఊర్మిళ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తర ముంబయి లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీకి ఎడంగా ఉంటున్నారు. శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినా ఊర్మిళ తిరస్కరించారు.

More Telugu News