Khushbu: దక్షిణాఫ్రికాలోని ఓ యూనివర్సిటీ గేటు వద్ద ఇలా రాసి ఉంటుంది: ఖుష్బూ

  • ఆసక్తికర సందేశాన్ని పంచుకున్న ఖుష్బూ
  • విద్యా వ్యవస్థ ప్రాముఖ్యతపై వివరణ
  • ప్రతి ఒక్కరికీ సందేశం అంటూ ట్వీట్
  • సాధారణ పదాలతో శక్తిమంతమైన సందేశం అని వెల్లడి
Khushbu shared a precious message

ప్రముఖ సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ ఆసక్తికర సందేశాన్ని అందరితో పంచుకున్నారు. విద్య, విద్యా వ్యవస్థల ప్రాముఖ్యత ఎంత ఉన్నతమైనదో తన పోస్టు ద్వారా వివరించారు. దక్షిణాఫ్రికాలోని ఓ విశ్వవిద్యాలయం గేటు వద్ద ఇలా రాసి ఉంటుందని వెల్లడించారు.

"ఓ దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులు, దూరశ్రేణి క్షిపణులు అవసరంలేదు... ఆ దేశ విద్యావ్యవస్థ ప్రమాణాలను దిగజార్చితే చాలు, ఆ దేశ విద్యార్థులను పరీక్షల్లో మోసాలకు పాల్పడేందుకు అనుమతిస్తే చాలు. అలాంటి విద్యార్థులు డాక్టర్లయితే వారి చేతుల్లో రోగులు చచ్చిపోతారు. అలాంటి విద్యార్థులు ఇంజినీర్లయితే వారు నిర్మించిన భవనాలు కుప్పకూలిపోతాయి. అలాంటి విద్యార్థులు ఆర్థికవేత్తలు, అకౌంటెంట్లు అయితే తీవ్ర ఆర్థిక నష్టాలు వాటిల్లుతాయి. అలాంటి విద్యార్థులు మత ప్రబోధకులైతే వారి చేతుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది. అలాంటి విద్యార్థులు జడ్జిలు అయితే వారి చేతుల్లో న్యాయం కడతేరి పోతుంది. విద్యా నాశనమే ఓ దేశ వినాశనం" అని పేర్కొన్నారని ఖుష్బూ వివరించారు.

ఈ సందేశంలో సాధారణ పదాలే ఉన్నా ఎంతో శక్తిమంతమైన అర్ధాన్నిస్తున్నాయని తెలిపారు. ఈ సందేశం ప్రతి ఒక్కరికీ అని వెల్లడించారు.

More Telugu News