Atchannaidu: అచ్చెన్నాయుడు, రామానాయుడులపై ప్రివిలేజ్ కమిటీ కీలక నిర్ణయం!

  • ఇద్దరికీ నోటీసులు ఇవ్వాలని కమిటీ నిర్ణయం
  • వచ్చే నెలలో తిరుపతిలో మరోసారి భేటీ
  • ఆ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
Privilege committee decides to send notices to Atchannaidu and Rama Naidu

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులపై ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసుపై ఈ సమావేశంలో చర్చించారు. వీరిద్దరికీ వారం రోజుల్లో నోటీసులు ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది.

చీఫ్ విప్ అసెంబ్లీలో తీర్మానం చేసిన మేరకు, స్పీకర్ రెఫర్ చేసినందున నోటీసులు ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. మరోవైపు 2019లో టీడీపీ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసు సరైన ఫార్మాట్ లో లేని కారణంగా దానిపై చర్చ జరగలేదని సమాచారం.

వచ్చే నెలలో తిరుపతిలో ప్రివిలేజ్ కమిటీ మరోసారి భేటీ కానుంది. ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెపుతున్నారు. తమ నేతలిద్దరికీ నోటీసులు పంపాలని ప్రివిలేజ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More Telugu News