బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

23-12-2020 Wed 12:08
  • మహబూబాబాద్‌ జిల్లాలోని గార్ల మండలంలో ఘటన
  • పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్న జంట
  • వారి ప్రేమకు పెద్దలు అడ్డు
  • మనస్తాపం చెంది ఆత్మహత్య  
lovers commit suicide
వారిద్దరు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అయితే, వారి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారు. దీంతో పెద్దలను ఎదిరించి జీవించలేక, ఒకరినొకరు విడిచి ఉండలేక తనువు చాలించారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్‌ జిల్లాలోని  గార్ల మండలం రాజుతండ పరిధిలోని వడ్ల తండ శివారులో చోటు చేసుకుంది.

అక్కడి ఓ బావిలో ఓ జంట మృతదేహాలు కనపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ అబ్బాయి, అమ్మాయిని గుగులోత్‌ ప్రశాంత్‌, భూక్య ప్రవీణగా పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలుసుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.